తిరుపతి ఎస్వీ గోశాలలో సోమవారం ఉదయం గోకులాష్టమి గోపూజ అనంతరం ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అగర బత్తుల తయారీ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ఆలయాల్లో ఉపయోగించిన పూలతో తయారు చేసే పరిమళమైన అగర బత్తులు వారం, పది రోజుల్లో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అగర బత్తులను ఆకర్షణీయమైన డిజైన్లతో, పది రకాల బ్రాండ్లతో తయారు చేసి అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. స్వామివారికి వినియోగించిన పూలను వ్రుధాగా పడేయకుండా వాటిని వాడుకలోకి తీసుకువస్తున్నట్టు చెప్పారు.