దోబీ ఘాట్ ల జాబితా అందజేయాలి..
Ens Balu
5
Srikakulam
2021-08-31 09:20:29
శ్రీకాకుళం జిల్లాలో దోబీ ఘాట్ లు అవసరమైతే ఆ జాబితా అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్-3 ఆర్. శ్రీరాములు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రజకుల సంక్షేమంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రజకులకు దోబీ ఘాట్ లు ఎక్కడైనా అవసరం అనుకుంటే ఆ జాబితాను అందజేస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే బి.సి. కార్పొరేషన్ ఇడి దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం కావాలనుకుంటే తెలియజేయాలని సూచించారు. రజకులలో చదువుకొని కాళీగా ఉన్నట్లు తెలియజేస్తే స్కిల్ డెవలప్ మెంట్ లో ఉపాధి కల్పిస్తామని తెలిపారు. పిల్లలను స్కూల్స్ లలో చేర్పించాలన్నా తెలియజేయాలని పేర్కొన్నారు. వచ్చే సమావేశం నాటికి సమస్యలు ఏవైనా ఉంటే సమావేశం దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. షాపులకు 100 యూనిట్లు సబ్సిడీ ఇస్తున్నారని, గృహాలకు 100 యూనిట్లు సబ్సిడి ఇవ్వాలని సభ్యులు యేసుపాదం కోరారు. జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాలు నిర్మించి కమ్యూనిటీకి అందజేసినట్లు బి.సి. కార్పొరేషన్ ఇడి రాజారావు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు మున్సిపాలిటీలు, పంచాయితీలలో షాపులు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. రజకుల సమస్యలు తీర్చడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మూడు నెలలకు ఒక సారి సమావేశం ఏర్పాటుచేయాలని, సమస్య ఏమైనా వస్తే అధికారులు స్పందించాలని కమిటీ సభ్యులు యేసుపాదం సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఇడి రాజారావు మాట్లాడుతూ దోబీ ఘాట్ లు ఉన్న చెరువులు అక్రమణలు జరుగుతున్నాయని చెప్పారు. కమ్యూనిటీ పై దౌర్జన్యాలు జరిగినా అలాంటి వివరాలు అందజేయాలని జెసి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయితీ అధికారి రవి కుమార్, కమిటీ సభ్యులు మహిళా కమిటీ సభ్యులు పిరిడి రాణి, మబగాపు రాజు, బొమ్మాళి చిన్నవాడు, డి. సూర్యనారాయణ, బొమ్మాళి వాహిణి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.