డిగ్రీ పరీక్షలు తక్షణమే వాయిదావేయాలి.


Ens Balu
4
Srikakulam
2021-08-31 09:29:17

శ్రీకాకుళం జిల్లాలోని డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని ఏ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా కన్వీనర్ పొన్నాడ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు నగరంలో ఆయన విద్యార్ధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు 4 మరియ 6 సెమిస్టర్ పరీక్షలు  వచ్చేనెల రెండో తేదీ నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ వారు నిర్వహించబోతున్నారన్నారు. దీనివల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.  అంబేద్కర్ యూనివర్సిటీ వైస్.ఛాన్సలర్, రిజిస్టర్ గారు పరీక్షల నిర్వహణను పునరాలోచన చేసి వాయిదా వేయాలని వారు కోరారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక్ష కంగా తరగతులు జరగలేదని, ఆన్లైన్లో  బోధన కేవలం రెండు నెలలోనే అరాకొర జరిపి పూర్తి చేశారన్నారు. దీనివల్ల విద్యార్థులకు సరిగా అవగాహనకు రాలేకపోయారన్నారు. ఫలితంగా పరీక్షలకు సమాయత్తం కాకపోవడం ఒక భాగమైతే, మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న డిగ్రీ విద్యార్థులకు అంతర్జాల సదుపాయం లేకపోవడం వల్ల అసలు వారికి ఆన్ లైన్ క్లాసులే జరగలేదన్నారు. ఈ కారణాలను ద్రుష్టిలో పెట్టుకొని డిగ్రీ పరీక్షలను వాయిదా వేసి వారి భవిష్యత్తును కాపాడాలని ఏఐఎస్ఎఫ్ ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోరంగి గోపి నాయుడు ఏ.ఐ.ఎస్.ఎఫ్ నాయకులు పరిడాల రాజశేఖర్,మెండి ప్రసాద్ కాదుర్లా శివ ,బెజ్జిపురం రాంబాబు,  విద్యార్థులు పాల్గొన్నారు.
సిఫార్సు