హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు తెలుగు ప్రజలంతా గర్వించే కళాకారుడని, ఆయన మన జిల్లాలో జన్మించడం మన అదృష్టమని సంయుక్త కలెక్టర్ ఆసరా జె.వెంకట రావు తెలిపారు. భాషా సాంస్కృతిక శాఖ అద్వర్యం లో మంగళ వారం సంగీత నృత్య కళాశాలలో ఆదిభట్ల జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన జేసీ కళాశాల వద్ద నున్న ఆదిభట్ల , ఘంటశాల చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభ లో ఆయన మాట్లాడుతూ హరికథ అనే కళను సమాజానికి పరిచయం చేసి, అభివృద్ధికి తోడ్పడిన గొప్ప వ్యక్తి ఆది భట్ల యని పేర్కొన్నారు. అంతరించిపోతున్న కళల్లో ప్రస్తుతం హరికథ ఒకటని, రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ కు ప్రాధాన్యత నిస్తూ అధికారిక కార్యక్రమాల్లో హరికథ కు అవకాశం కల్పిస్తూ కళా కారులను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. ఎందరో కళాకారులను అందించిన సంగీత కళాశాల కు వై.ఎస్.ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ను అందించడం గర్వాంగా ఉందన్నారు. హరికధకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు కాపీలేశ్వరం లో శిక్షణా కళాశాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న కుమారి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.