ప్రభుత్వం ద్రుష్టికి జిసిసి ఉద్యోగుల సమస్యలు..


Ens Balu
3
Chittoor
2021-08-31 11:03:37

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జిసిసి)లో పనిచేసే సమస్యల పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని చైర్మన్ డా.శోభా స్వాతిరాణి పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లాలోని తేనె ప్యాకింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిసిసి ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి తనవంతు క్రుషి చేస్తానని చెప్పారు. జిసిసి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోని జిసిసికి చెందిన అన్ని తయారీ యూనిట్లలోనూ పర్యటించి అక్కడి తాజా పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చైర్మన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా తేనెయూనిట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.