బి.కృష్ణారావు సేవలు ప్రశంసనీయం..


Ens Balu
3
Visakhapatnam
2021-08-31 15:09:25

విశాఖ సమాచార శాఖలో  బి.కృష్ణారావు ఆడియో విజువల్ సూపర్వైజర్ ప్రశంసనీయమైన సేవలు అందించారని ఉపసంచాలకులు వి.మణిరామ్ పేర్కొన్నారు. డి.డి. కార్యాలయం  ఆడియో విజువల్ సూపర్వైజర్ గా పనిచేసిన కృష్ణారావు పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కృష్ణారావు సౌమ్యుడు, కార్యశీలి అని కొనియాడారు. 1984లో సర్వీసులో చేరి పబ్లిసిటీ అసిస్టెంట్, ఏవీఎస్ గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పని చేశారు.  అందరితో కలుపుగోలుగా ఉంటూ విధినిర్వహణలో జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల నుండి అభినందనలు అందుకున్నారని చెప్పారు.  ఈ సందర్భంగా సమాచార శాఖ సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులు కృష్ణారావును ఘనంగా సన్మానించారు. సమాచార శాఖ అధికారులు, సిబ్బంది కృష్ణారావు మరుపురాని సేవలను తలచుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పౌరసంబంధాల అధికారులు డి. సాయిబాబా కే.సుమిత్రా దేవి, లైబ్రేరియన్ ఝాన్సీరత్నాబాయి, ఎస్.ఏ. వి.శ్రీనివాసరావు, ఏపీఆర్ఓ ఎం. కిషోర్ కుమార్, ఫోటోగ్రాఫర్లు కే.వెంకటరావు ఎస్.మోహన్ బాబు, కార్యాలయ సిబ్బంది  ప్రతిభా భారతి, ఇందిరాదేవి, కృష్ణ, ఖాదర్, అలీమ్, సత్య, నాయడు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.