తూ.గో.జి.లో 2.11లక్షల హెక్టార్లలో వరినాట్లు..


Ens Balu
3
Kakinada
2021-09-01 06:39:13

తూర్పుగోదావవరి జిల్లాలో 2లక్షల 11వేల 282 హెక్టార్లలో వరినాట్లు పూర్తి అయ్యాయని వ్యవసాయశాఖ జాయింట్ డెక్టర్ ఎన్.విజయకుమార్ తెలియజేశారు. బుధవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు తూర్పుగోదావరి జిల్లాలో 2లక్షల 29వేల 950 హెక్టార్లలో ఖరీఫ్ సీజన్ కు వరినాట్లు పడాల్సి వుండగా 90శాతం పూర్తిఅయినట్టు ఆయన వివరించారు. ఈ సంవత్సరం వర్షాలు కూడా అధికంగా కురుస్తున్నందున రైతులకు మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నందను రైతులకు గ్రామస్థాయిలోనే ఆర్బీకేల్లో వ్యవసాయ సహాయకుల ద్వారా అన్ని సహాయ సహకారాలు, సూచనలు, సస్యరక్షణ చర్యలుపై అవగాహన కల్పిస్తున్నట్టు ఆయన వివరించారు. రైతులు కూడా వ్యవసాయశాఖ సేవలను వినియోగించుకోవాలన్నారు.