వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా ఘనంగా జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు , ఎస్.దుర్గారావులు తెలిపారు . ఈ మేరకు బుధవారం దాబాగార్డెన్స్ వీజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టుల పిల్లల్లో ప్రతిభాపాటవాలు వెలికి తీసేందుకు ప్రతి ఏటా క్రమంతప్పకుండా ఎల్.కె.జి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ఉపకార వేతనాలు అందజేస్తున్నామన్నారు. ఎంసెట్లో కూడా ఒకరిని ఎంపిక చేసి ప్రోత్సహిస్తున్నామన్నారు. స్టేట్ , సీబీఎస్ఇ కేటగిరీల కింద ఉపకార వేతనాలు పంపిణి చెయ్యడం జరుగుతుందని, కావున ఉపకార వేతనాల కోసం ఫోరం సభ్యులు తమ దరఖాస్తులో వివరాలు పొందు పరిచి , రెండు ఫోటోలు , మార్కులు (గ్రేడ్ తో) జాబితాను డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ పనివేళల్లో అందజేయాలని వీరు కోరారు. త్వరలో ఆంధ్రా యూనివర్సిటీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియం వేదికగా జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు అందజేస్తామన్నారు. ఇతర వివరాలు కోసం ఉపకార వేతనాలు కమిటీ ఛైర్మన్ గంట్ల శ్రీను బాబు ఫోన్ నెంబర్ 800800 4763 లో సంప్రదించవచ్చు నన్నారు. ఆయా విభాగాలకు సంబంధించి కో-చైర్మన్ లుగా నానాజీ. దాడి రవి కుమార్, పిఎన్ మూర్తి , కార్య వర్గ సభ్యులు వ్యవ హరిస్తారన్నారు.
జర్నలిజంలో వేర్వేరు రంగాల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన పలువురు జర్నలిస్టులకు ప్రతిభకు ప్రోత్సాహం పేరిట మీడియా అవార్డులను అందజేయనున్నట్లు అవార్డుల కమిటీ చైర్మన్ ఆర్.నాగరాజు పట్నాయక్ తెలిపారు . ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా , ఫోటో జర్నలిస్టులు , వీడియో జర్నలిస్టులుతో పాటు రెండేళ్లుగా వెబ్ చానల్స్ జర్నలిస్టులకు అవార్డులు , ఎంపికలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు . ప్రతిష్టాత్మకమైన కపిలగోపాలరావు , మసూన మాష్టారు . అవార్డులుతో పాటు పలు కేటగిరిల కింద అతిధులు చేతులు మీదుగా నగదు బహుమతితో పాటు ఘనంగా సత్కరించి అవార్డులను అందజేస్తామన్నారు . ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు . ప్రతీ ఏటా ప్రతిభ చూపిన జర్నలిస్టులను గుర్తించాలన్నది వైజాగ్ జర్నలిస్టుల ఫోరం లక్ష్యమని వివరించారు . ఇప్పటి వరకు అనేక మంది జర్నలిస్టులను గుర్తించి ప్రోత్సహించిన ఘనత పోరంకే దక్కుతుందన్నారు.