తూ.గో.జి.లో రూ.70.93 కోట్ల వసూలు లక్ష్యం..


Ens Balu
2
Kakinada
2021-09-01 08:19:37

తూర్పుగోదావరిజిల్లాలో 22 వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా రూ.25.97 కోట్ల రూపాలు పన్నులు వసూలు చేసినట్టు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు సూర్యప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. బుధవారం కాకినాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 22 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల ద్వారా రూ.70.93 కోట్ల వసూలు లక్ష్యంగా ఇప్పటి వరకూ 25.97 కోట్లు వసూలు చేయగలిగామన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి కాస్త అధికంగా శ్రమిస్తున్నట్టు చెప్పిన ఆయన కరోనా నేపథ్యంలో వసూళ్లు కాస్త తక్కువగా జరిగినట్టు  వివరించారు. కాగా ప్రస్తుతం జిల్లాలో 15 రైతుబజార్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని ఏడి వివరించారు. 

సిఫార్సు