తూర్పుగోదావరి జిల్లాలో141 హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నట్టు హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.రామ్మోహన్ తెలియజేశారు. బుధవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 64 మండాల్లోని గ్రామ సచివాలయాల్లో ఇప్పటి వరకూ 300 మంది హార్టికల్చర్ అసిస్టెంట్లను భర్తీచేశామన్నారు. జిల్లాకి 441 పోస్టులను ప్రభుత్వం కేటాయించినట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలను ఇటీవలే ప్రభుత్వానికి నివేదించినట్టు చెప్పారు. ఇంకా మిగిలిన పోయిన ఖాళీలను ప్రభుత్వం మరోసారి చేపట్టే నియామకాల్లో భర్తీచేసే అవకాశాలున్నాయన్నారు.