యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలి..


Ens Balu
5
Srikakulam
2021-09-01 15:20:11

యువత సమాజంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఎచ్చెర్ల టిటిడిసిలో ఐ ఎస్ ఎం ఓ శిక్షణా కేంద్రం, సోలార్ సిస్టమ్ ను  ముఖ్య అతిథి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బుధ వారం ప్రారంభించారు.  సిడాక్ సంస్థ సౌజన్యంతో యువతకు శిక్షణా కార్యక్రమాలు జరగనున్నాయి. వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే పలాస, సోంపేట, రాజాం తదితర ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ అత్యధిక మానవ వనరులు కలిగిన దేశం భారత దేశం అన్నారు. మానవ వనరులను చక్కగా వినియోగించుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. పార్లమెంటు నియోకవర్గం స్థాయిలో నైపణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సిడాక్ సౌజన్యంతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. డిఆర్డిఎ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయం, విద్యా, వైద్యంకు ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవతంగా పనిచేస్తోందని, నిరుద్యోగాన్ని నివారించుటకు దోహదం చేస్తుందని చెప్పారు.  యువతలో నైపుణ్యం ఉంటే ఆదాయం పెరుగుతుందని ఆయన సూచించారు. నరసన్నపేట లో నైపుణ్య అభివృద్ధి సంస్థ మంజూరు అయిందని,  బుడితిలో త్వరలో శిక్షణ ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ముఖ్య మంత్రి ఆశయం అన్నారు. దిశ, పరిశ్రమలలో 75 శాతం స్థానికులకే  ఉద్యోగాలు, చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు తదితర ఎన్నో నూతన చట్టాలను ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన అన్నారు. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళలకు అందించామని, అమ్మ ఒడి తదితర కార్య్రమాలను అమలు చేస్తూ పేదలకు అండగా ప్రభుత్వం ఉందన్నారు. ముఖ్య మంత్రి జగన్ మీకు అండగా ఉన్నారని ఆయన చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలోనే ఎచ్చెర్ల ఉండాలని ముఖ్య మంత్రిని కోరామని, ఆ మేరకు ఆయన అంగీరించారని తెలిపారు. శాసన సభ్యులు గొర్లే కిరణ్ కుమార్ మాట్లాడుతూ యువతలో నైపుణ్యాభివృద్ధి కావాలన్నారు. అన్ని పరిశ్రమలతో సమావేశం నిర్వహించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కంప్యూటర్ శిక్షణ పొందాలన్నారు. సిడాక్ ద్వారా శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఉపాధి కల్పన, ఎంటర్ ప్రైజ్ ప్రారంభానికి అవకాశముందన్నారు. చక్కటిశిక్షణ పొంది మంచి ఉపాధి పొందాలని, ఎంటర్ప్రెన్యూయర్ గా మారి పలువురికి ఉపాధి కల్పించాలన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ బి. శాంతి శ్రీ మాట్లాడుతూ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను పంపిణీ చేసారు. ఉప ముఖ్యమంత్రి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డిపిఎం సి.హెచ్. రామ్మోహన్, డిపిఎంలు తదితరులు పాల్గొన్నారు.