జిల్లాలో కొత్తగా 16 రైతుభజార్లు మంజూరు..


Ens Balu
3
Kakinada
2021-09-02 03:49:49

తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 16 రైతుబజార్లు మంజూరు అయ్యాయని మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు సూర్యప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. బుధవారం కాకినాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం 18 రైతు బజార్లుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పెడితే 16 మంజూరు చేసినట్టు చేసినట్టు చెప్పారు. అందులో కాకినాడ అర్భనల్-2, కాకినాడ రూరల్-2, రామచంద్రాపురం-1, రాజమండ్రి-2, రాజానగరం-4, ఏలేశ్వరం-1, జగ్గంపేట-1, రంపచోడవరం-1, చింతూరులో-1 చొప్పున ఉన్నాయన్నారు. వీటిని త్వరలోనే ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. రైతు బజార్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు అన్ని రకాలక కూరగాయలు ఒకేచోట లభించడానికి ఆస్కారం వుంటుందని ఆయన తెలియజేశారు.