తూ.గో:లో 69 అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఖాళీ..


Ens Balu
2
Kakinada
2021-09-02 04:25:13

తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయశాఖలో 69 విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీలు భర్తీకాలేదని అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎన్వీరమణ తెలియజేశారు. బుధవారం కాకినాడలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 64 మండలాల్లోని 749 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయన్నారు. మిగిలిన పోస్టుల వివరాలను ఇటీవలే ప్రభుత్వానికి ఖాళీల జాబితా గ్రామసచివాలయాల వారీగా నివేదించామన్నారు. ప్రస్తుతం వీరంతా జిల్లా వ్యాప్తంగా సేవలందిస్తున్నారన్నారు. వచ్చే నోటీఫికేషన్ లో మిగిలి పోయిన ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉండవచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యధిక సంఖ్యలో సిబ్బంది నియామకంతో రైతులకు సకాలంలో సేవలు అందుతున్నాయని జాయింట్ డైరెక్టర్ వివరించారు.