వంశధార పూర్తిచేస్తాం- డిప్యూటీ సీఎం క్రిష్ణ దాస్


Ens Balu
2
Srikakulam
2020-09-08 21:57:02

వంశధార ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు. శ్రీకాకుళంలో రూ.1.98 కోట్లతో నిర్మించిన బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశ ధార ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి క్రిష్ణ దాస్ మాట్లాడుతూ జిల్లాకు ప్రధానమైనది వంశధార ప్రాజెక్టు అన్నారు. రాష్ట్రంలో ప్రాధాన్యత గల జలవనరుల ప్రాజెక్టులలో వంశధార ప్రాజెక్టును చేర్చడం జరిగిందని అన్నారు.  జిల్లాకు వంశధార జీవనాడి అని ఆయన పేర్కొన్నారు. వంశధార ప్రాజెక్టును త్వరలో పూర్తి చేయడమే కాకుండా నిర్వాసితులకు అందాల్సిన నష్టపరి హారం కూడా త్వరలో అందిస్తామని ఆయన చెప్పారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపించుటకు ప్రభుత్వం కృత నిశ్చయముగా ఉందని తెలిపారు. వై. యస్.రాజశేఖర రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జలవనరుల ప్రాజెక్టులను చేపడుతున్నారని ఆయన అన్నారు.     రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ బొడ్డేపల్లి రాజగోపాల రావు వంశధార ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్ నూతన కార్యాలయ భవనం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా నదులకు నిలయమని, ఆ నదీ జలాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రభుత్వం కొత్తగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ లను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా పొందూరు మండలం వి.ఆర్.గూడెం వద్ద ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ రానుందని చెప్పారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు, జలవనరుల శాఖ నార్త్ కోస్ట్ సిఇ సి హెచ్.శివరామ ప్రసాద్, ఎస్ ఇ లు పి.రంగారావు, డోల తిరుమల రావు., మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ప్రకాష్, తదితర అధికార అనాధికారులు పాల్గొన్నారు.