ప్రతీ ఉద్యోగి రెండు మొక్కలు నాటాలి..
Ens Balu
2
Vizianagaram
2021-09-02 08:49:55
ప్రభుత్వ ఉద్యోగులందరూ ఖచ్చితంగా రెండు మొక్కలు నాటి, వాటి సంరక్షణ కూడా వారే చూసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన చేసిన ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వివిధ రకాల మొక్కలను నాటారు. ప్రతీరోజూ నీరు పోసి, వాటిని జాగ్రత్తగా సంరక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బందీ పాల్గొన్నారు.