అపోహలు వీడికి కరోనా టీకా వేయించుకోవాలి..


Ens Balu
2
Bangarupalem
2021-09-02 09:26:17

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసమే వ్యాక్సినేషన్ చేపడుతోందని అపోహలు మాని అందరూ టీకా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అన్నారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ బంగారుపాలెం మండలం లోని రాగిమాను పెంట రహదారిలో అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్ల నిర్వహణ అత్యంత ప్రధాన మైనదని నిర్వహణ చేసే వారు జాగ్రత్తగా చెట్లను బ్రతికించే లా చూడాలని అన్నారు. అనంతరం రాగి మాను  పెంట గ్రామ సచివాలయంను తనిఖీ చేశారు. డిజిటల్ విధానంలో హాజరు పట్టికను పరిశీలించిన కలెక్టర్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను పరిశీలించారు. నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారి గురించి డిజిటల్ అసిస్టెంట్ ను అడిగి వివిధ పథకాలకు సంబంధించి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారని అడిగారు. వాలంటీర్లను వ్యాక్సినేషన్ ప్రక్రియ, సంక్షేమ పథకాల లబ్ధిదారుల, బీమా కు సంబంధించి ఏ విధంగా చేస్తున్నారని అడిగారు. వాక్సినేషన్ కార్యక్రమం గురించి ఉన్న అపోహలను పోగొట్టాలని నూరుశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగేటట్లు చూడాలని ,అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉండగలరని ఆ విధంగా ప్రజలలో అవగాహన కల్పించాలని వాలంటీర్లు సచివాలయ సిబ్బంది కలసి గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ క్లినిక్ కేంద్రాలను పరిశీలించి వేగవంతంగా పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎగువ రాగిమాను పెంట మణికంఠ  అనే రైతు డ్రైలాండ్ హార్టికల్చర్ పథకం కింద సాగు చేసిన మామిడి చెట్లను పరిశీలించారు. దీనికి సంబంధించి లబ్ధిదారుల లో నగదు బదిలీకి సంబంధించి వివరాలు అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బందితో మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గురించి ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని, ఉద్యాన పంటలు పెంపు ద్వారా నగదు ఎంత వస్తుంది అని వివరాలు రైతులకు పూర్తిగా తెలియజెప్పాలని అన్నారు. ఎగువ రాగి మాను పెంట లో ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గా నిర్మాణ సామాగ్రి లభ్యం కావడం లేదని పలువురు ధరలను పెంచి అమ్ముతున్నారని కలెక్టర్ కు తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఎంపిడిఓ,తహసీల్దార్ లు ధరల నియంత్రణ చేయాలని అన్నారు.
 అనంతరం నిర్వహిస్తున్న రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా kiosk యంత్రం పనితీరు గురించి ఎటువంటి విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు ఆర్డర్ చేయడం జరిగిందని అదే విధంగా మొదటి వారంలో రైతు సలహా మండలి సమావేశం నిర్వహిస్తున్న రాలేదా అని సిబ్బందిని అడిగారు. గ్రామంలో ఎక్కువగా మెట్ట పంట మీద ఆధారపడి ఉన్నారని 40 ఎకరాలు వరి వేస్తున్నారని వారిని కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని ఇప్పటికే రైతులకు అవగాహన కల్పిస్తున్నామని సిబ్బంది కలెక్టర్ కు తెలిపారు. గ్రామంలో మొత్తం రైతు భరోసా కింద 10 68 మంది లబ్ధి పొందారని తెలిపారు. ఈ విధంగా మొత్తం ఎనిమిది వందల మంది రైతులకు సంబంధించి 1300 ఎకరాల లోఈ- క్రాప్ బుకింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, రైతు భరోసా కేంద్రం ద్వారా వేరుశనగ కందులు ఇవ్వడం జరిగిందని మొత్తం 600 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని వివరించారు.
    బంగారుపాలెం మండలం లోని పాలేరు గ్రామానికి సంబంధించిన గృహానిర్మాణాలకు సంబంధించిన లేఅవుట్ ను కలెక్టర్ పరిశీలించారు.చాలా వరకు ఇల్లు నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ఇంటి నిర్మాణానికి కావాల్సిన వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని లబ్ధిదారులు కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ భవన నిర్మాణ సామాగ్రి ధరలు పెరగకుండా చూడాలని లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను సజావుగా నిర్మించుకొనేలా చూడాలని అందుకు  సహకరించాలని అధికారులతో అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి, హౌసింగ్ పిడి పద్మనాభం, పంచాయతీరాజ్ డిఇ రాఘవరెడ్డి, తహసిల్దార్ సుశీలమ్మ, ఎంపీడీవో విద్యారమ లతో పాటు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.