బధిర అభ్యర్థులకు APVCC టచ్ ఫోన్లు..


Ens Balu
3
Srikakulam
2021-09-02 12:24:03

బధిర అభ్యర్థులకు ఎపివిసిసి ద్వారా టచ్ ఫోన్లు ఉచితంగా సరఫరా చేయబడునని విభిన్న ప్రతిభావంతుల శాఖ హాయ సంచాలకులు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  జిల్లాలో గల 18 సంవత్సరములు నిండి 40 సంవత్సరములు లోపు ఉన్న 10వ తరగతి మరియు ఆపై తరగతులు చదువుకున్న చదువుచున్న బధిర అభ్యర్థులకు APVCC ద్వారా టచ్ ఫోన్ ఉచితముగా సరఫరా చేస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.   దృవ పత్రములు ఆన్ లైన్ లో apdascac.ap.gov.in అనే వెబ్ సైట్ లో ధరఖాస్తు చేసుకోనవలసినదిగా ఆ ప్రకటనలో కోరారు. దరఖాస్తు చేసిన వారు సదరం (వైద్యదృవ పత్రము 40 శాతము ఆపై బడి ఉండవలెను), ఆధార్ కార్డు,  తెల్ల రేషన్ కార్డు, Sign language Certificate (ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉన్న ఆడియోలజిస్ట్ ద్వారా), 10వ తరగతి మరియు ఆ పై తరగతులు చదువుకున్న సర్టిఫికేట్లు జతచేయవలసినదిగా ఆ ప్రకటనలో వివరించారు.  అప్లోడ్ చేసిన తదుపరి ఆన్ లైన్ రశీదుతో పాటు ఆన్ లైన్ లో చేసిన దరఖాస్తును జత చేసి సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల శాఖ, శ్రీకాకుళం కార్యాలయంనకు (Hard Copy)పోస్టు ద్వారా గానీ, కార్యాలయ పని వేళల్లో అందజేయవలసినదిగా తెలిపారు.  జిల్లాలో గల అర్హులైన బధిరులు అభ్యర్థులు ఈ అవకాశము సద్వినియోగము చేసుకోవలసిందిగా ఆ ప్రకటనలో కోరారు. కార్యాలయము Mail Address addwskim@gamil.com పంపవలసినదిగా పూర్తి వివరములకు సహాయ సంచాలకులు వారి కార్యాలయము పోన్ నెం. 08942 240519 కు సంప్రదించవలసినదిగా ఆ ప్రకటనలో తెలిపారు.