తూర్పుగోదావరి జిల్లాలోని 64 మండలాల్లాల్లో 50,693.90 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్దంగా ఉన్నాయని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్.విజయ్ కుమార్ తెలియజేశారు. శుక్రవారం ఈమేరకు కాకినాడ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కు ఎరువులును సమ్రుద్ధిగా మంజూరు చేసిందన్నారు. వీటిని అన్ని మండలాలకు సరఫరా చేసినట్టు ఆయన వివరించారు. రైతులు వినియోగాన్ని బట్టీ గ్రామసచివాలయ పరిధిలోని రైతు భరోసా కేంద్రాల నుంచి వీటిని కొనుగోలు చేసుకోవచ్చునని ఆయన తెలియజేశారు. రైతులకు నకిలీ ఎరువుల వినియోగించకుండా ప్రభుత్వమే నాణ్యమైన ఎరువులను సిద్దం చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వచ్చిన ఎరువలన్నీ అగ్రిల్యాబ్ ద్వారా టెస్టింగ్ లో నాణ్యత పరిశీలించి వచ్చివేనని జాయింట్ డైరెక్టర్ వివరించారు.