విశాఖలో ఈ నెల 27 నుంచి  పాలిసెట్..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 3
                            
                         
                        
                            
Visakhapatnam
                            2020-09-08 22:52:48
                        
                     
                    
                 
                
                    విశాఖ పాలిటెక్నిక్ కళాశాలలో చేరేందుకు నిర్వహించే పాలిసెట్ అర్హత పరీక్షను ఈ నెల 27న నిర్వహించనున్నట్టు కన్వీనర్ శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సంద ర్భంగా ఆయన విశాఖలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఉదయం 11 గంటలనుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష  జరగనుందని వివరించారు. విశాఖ జిల్లాలో 9,844 మంది  అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పిన ఆయన వీరి కోసం 24 సెంటర్లను కేటాయించినట్టు చెప్పారు. దరఖాస్తు చేసే సమయం లోనే హాల్ టికెట్లను జారీ చేశామని వాటి ఆధారంగా పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయాల్సి వుంటుందన్నారు. ఈ పరీక్ష కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈసారి పరీక్షకు హాజరయ్యేవారి సంఖ్య తక్కువగా ఉండచ్చునని తెలుస్తుంది అయినప్పటికీ దరఖాస్తు చేసుకున్న విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగానే కేంద్రాలను కేటాయించారు. అంతేకాకుండా అభ్యర్ధులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని చెప్పిన ఆయన ఆలస్యానికి  బాధ్యత విద్యార్ధులే వహించాల్సి వుంటుందన్నారు. కోవిడ్19 ని ద్రుష్టిలో వుంచుకొనే అన్ని ఏర్పాట్లు చేసినట్టు కన్వీనర్ తెలిపారు.