రాష్ట్ర జిడిపి వృద్థికి ఎంఎస్ంఇలు దోహదపడతాయని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారం పేర్కొన్నారు. శుక్రవారం ఎంఎస్ఎంఇ, హేండ్లూమ్స్, స్పిన్నింగ్ మిల్స్ లకు ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో ఇన్సెంటివ్స్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం సహకారం అవసరమన్నారు. ముఖ్యమంత్రి పెద్దమనసుతో ఎంఎస్ఎంఇలకు ఇప్పటి వరకు 2086.42 కోట్లు ప్రోత్సాకాలు ఇచ్చినట్లు చెప్పారు. 22, మే 2020 నెలలో ఎంఎస్ఎంఇలకు రీ స్టార్ట్ ప్యాకేజి కింద 450.27 కోట్లు, 29 జూన్, 2020లో ఎంఎస్ఎంఇలకు రీ స్టార్ట్ ప్యాకేజి కింద 453.64 కోట్లు, 29, జూన్, 2020న ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లకు 58.51 కోట్లు, 3, సెప్టెంబరు 2021న ఎంఎస్ఎంఇలకు 440 కోట్లు, 3, సెప్టెంబరు 2021న టెక్స్ టైల్స్ / స్పిన్నింగ్ మిల్స్ కు 684 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వివరించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చట్టం తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. చిన్న చిన్న పరిశ్రమలు ఇప్పటికే తమ ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాలకొండ శాసన సభ్యురాలు వి. కళావతి, తదితరులు పాల్గొన్నారు.