ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకువచ్చి పరిశ్రమలను స్థాపించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్య కుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లి నుండి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సూక్ష్మ, చిన్న మధ్య తరహ పరిశ్రమలకు 2 వ విడత రాయితీ ని రాష్ట్ర వ్యాప్తంగా వారి ఖాతాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బటన్ నొక్కి జమ చేసారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా నుండి కలెక్టర్ తో పాటు శాసన సభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం లబ్ది దారులకు మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో 2 వ విడత క్రింద 25 ఎం.ఎస్.ఎం.ఈ లకు 3.4 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఈ అర్ధిక సహాయాన్ని పరిశ్రమల అభివృద్ధికి వినియోగించుకోవాలని అన్నారు. వచ్చే సోమవారం పరిశ్రమల అభివృద్ధి పై సమావేశం నిర్వహిస్తున్నామని, ఔత్సాహికులంతా ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు.
ఈ కార్యక్రమం లో వరల్డ్ విజన్ సంస్థ , సెట్విజ్ ఆధ్వర్యం లో నవరత్నాల పై ముద్రించిన నవరత్న మాలిక పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కరోనా లో కూడా సహాయం : నెల్లిమర్ల శాసన సభ్యులు బడ్డుకొండ
పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే యువతీ యువకులకు ప్రస్తుత ప్రభుత్వం అనేక అవకాశాలను అందిస్తూ ప్రోత్సహిస్తుందని నెల్లిమర్ల శాసన సభ్యులు బడ్డుకొండ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రం లో అన్ని జిల్లాల కంటే విజయనగరం లో తక్కువ పరిశ్రమలు ఉన్నాయని, ప్రభుత్వం పరిశ్రమలకు అందించే రాయితీల పై ప్రచారం ఎక్కువగా జరగాలని అన్నారు. ఎస్.సి. ఎస్.టి. బి.సి.,మైనారిటీ , మహిళల, విద్యార్ధుల సంక్షేమానికి పధకాలను, రాయితీలను అందించడానికి ప్రభుత్వం ఒక క్యాలెండర్ ను రూపొందించి, ప్రకటించిన తేదీల కు అనుగుణంగా క్రమం తప్ప కుండా అందిస్తూ కరోనా కాలం లో ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్ జే. వెంకట రావు, పరిశ్రమల జనరల్ మేనేజర్ జి.ఎం. శ్రీధర్ , ఎ.డి సీతారాం , ఐ.పి.ఓ లు పాల్గొన్నారు.