ఈనెల7కి గ్రౌండ్ వేలిడేషన్ పూర్తికావాలి..
Ens Balu
3
Srikakulam
2021-09-03 12:51:18
శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబర్ 7 నాటికి గ్రౌండ్ వేలిడేషన్ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సర్వే ఎడి ప్రభాకరరావు ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జగనన్న భూ రక్షణ, శాశ్వత భూ హక్కు, భూ రక్ష పై పైలెట్ గ్రామాల్లో జరుగుతున్న పనులపై జిల్లా జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డాక్టర్ శ్రీనివాసులుతో కలసి శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఒఎల్ఆర్ పక్కాగా ఉంటే సమస్యలు ఉండవని చెప్పారు. ఏ రోజు ఎన్ని గ్రామాల్లో పనులు జరుగుచున్నవో ఆ వివరాలు రాసుకోవాలన్నారు. పిఒఎల్ఆర్ ప్రగతి పై వారానికి రెండుసార్లు సమావేశం జరగాలని ఆదేశించారు. డిజిటల్ పంచాయతీల పనులు ఎంత వరకు వచ్చింది డిపిఓ రవి కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. భూముల రీ సర్వే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఏడి సర్వేను ఆదేశించారు. రీ సర్వే 3 ఫైలట్ గ్రామాల్లో డ్రోన్ తో సర్వే పూర్తి అయినదని, సెప్టెంబర్ 7 నాటికి గ్రౌండ్ వేలిడేషన్ పూర్తి చేయాలన్నారు. సమస్యలు ఉంటే 30 రోజుల్లో(అప్పీలు చేసుకోవాలి) పరిష్కారంచేసి సమస్య అక్టోబర్ 2 నాటికి పూర్తి చేయాలని చెప్పారు. డ్రోన్ సర్వే పూర్తి అయిన భూ యజమానులైన రైతులకు నోటీసులు జారీ చేసి వారి సమక్షంలోనే పిఒఎల్ఆర్ ప్రకారం సర్వే చేసి లోపాలుంటే సరి చేయాలని ఆదేశించారు. ఎల్పిఎం జనరేషన్ చేసి సరిచేయాలని, అప్పటికి ఎక్సటెంట్ సరిపోకపోతే డివిజన్ పరిధిలో అప్పీలు చేసుకోవాలని, అప్పటికి సంతృప్తి చెందకపోతే జిల్లా స్థాయిలో అప్పీలు చేసుకొని సమస్య పరిష్కరించుకోవాలని చెప్పారు. అనంతరం రెవిన్యూ ప్రకారం పాసు పుస్తకాలు జారీ చేయబడునని వివరించారు. ఈ సమావేశంలో భూ సర్వే శాఖ సహాయ సంచాలకులు కుంచె ప్రభాకర్, ఉప కలెక్టర్ టి సీతారామమూర్తి, డిపిఓ రవి కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ లక్ష్మీపతి, తదితరులు పాల్గొన్నారు.