అధిక ఫీజులు వసూలుచేస్తే కఠిన చర్యలు..
Ens Balu
3
Srikakulam
2021-09-03 16:44:22
ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకంటే అధిక ధరలు వసూలుచేస్తే సంబంధిత ఆసుపత్రులు మరియు ల్యాబరేటరీల రిజిస్ట్రేషన్లను తక్షణమే రద్దు చేయడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కె.సి.చంద్రనాయక్ హెచ్చరించారుఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేసారు. కోవిడ్ పరీక్షల కొరకు వచ్చిన రోగులనుండి ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబరేటరీలు కోవిడ్ పేరుతో అధికమొత్తంలోరుసుములు వసూలు చేస్తున్నట్లు జిల్లాయంత్రాంగం దృష్టికి వచ్చిందన్నారు. కోవిడ్ పరీక్షలకు సంబంధించి రేపిడ్ యాంటీజెన్ పరీక్షకు రూ. 230/-లు,ఆర్.టి.పి.సి.ఆర్.పరీక్షకు రూ.499/-లు, హెచ్.ఆర్.సి.టి పరీక్షకు రూ.3,000/-లు మాత్రమే వసూలు చేయాలని చెప్పారు. లేనిఎడల అట్టి ప్రైవేటు ఆసుపత్రులు మరియు ల్యాబరేటరీలు యాజమాన్యంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబడునని మరియు ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆయా ఆసుపత్రులు, ల్యాబరేటరీల రిజిస్ట్రేషన్లు తక్షణమే రద్దు చేయబడునని హెచ్చరించారు. అలాగే ఎపిడిమిక్ డిసిజేసేస్ యాక్ట్ అనుసరించి కోవిడ్ నిబంధనల ప్రకారం అట్టి యాజమాన్యాల నుండి జిల్లా కలెక్టర్ వారు నిర్ధేశించిన అపరాధ రుసుములను వసూలు చేయబడునని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.