5న ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు..
Ens Balu
3
Srikakulam
2021-09-03 16:45:13
డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురష్కరించుకొని సెప్టెంబర్ 5న ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి మరియు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల ఆహ్వాన సంఘం కార్యదర్శి జి.పగడాలమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన జారీచేసారు. ఆదివారం ఉదయం 10గం.లకు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక, పాడిపారిశ్రామిభివృద్ధి శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు ఆమె చెప్పారు. వీరితో పాటు పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా అధికారులు తదితరులు హాజరవుతారని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కావున ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.