శ్రీకాకుళం జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారుల వివరాలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయానికి అందజేయాలని ఆ సంస్థ జిల్లా ముఖ్య క్రీడా శిక్షణాధికారి బి.శ్రీనివాస కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు 2020-21 మరియు 2021-22 సం.లలో దారిద్ర్యరేఖకు దిగువన ఉండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారు మరియు అర్హత పొందిన క్రీడాకారులు తమ వివరాలను వీలైనంత త్వరగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, సెట్ శ్రీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం, శ్రీకాకుళం వారికి అందజేయాలని కోరారు. ఇతర వివరాల కొరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయ పనివేళల్లో 98660 98642 లేదా 92488 07249 మొబైల్ నెంబర్లకు సంప్రదించవచ్చని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.