రైతులకు ప్రయోజాలు చేకూర్చాలి..
Ens Balu
3
Kakinada
2021-09-03 16:50:40
రైతుల ప్రయోజనాలు లక్ష్యంగా సాగునీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందించి వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చేవూరి హరికిరణ్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో ఇరిగేషన్, డ్రెయిన్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సి.హరికిరణ్.. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశతో కలిసి జలవనరులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలు, రైతులకు ఉపయోగపడేలా డెల్టా కాలువల సమర్థ నిర్వహణ ఉండాలని, ఆధునికీరణకు సంబంధించి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ బి.రాంబాబు, డిప్యూటీ ఎస్ఈ ఐవీ సత్యనారాయణ; తూర్పు, సెంట్రల్ డెల్టాల ఇరిగేషన్, డ్రెయిన్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.