స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న అజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా, ఇంటింటికీ ఔషద మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు(ఎన్ఎంపిబి) నిర్వహిస్తోంది. ఆయుష్ ఆప్‌కి ద్వార్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టరేట్లో, జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా జమ్ము పాఠశాలకు ఔషద మొక్కలను కలెక్టర్ పంపిణీ చేశారు. ఆయుష్ ఆప్ కి ద్వార్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని బలిజిపేట, బొబ్బిలి, గరుగుబిల్లి, జిఎల్ పురం, కొమరాడ, మక్కువ, మెరకముడిదాం, పార్వతీపురం, సీతానగరం, తెర్లాం తదితర 10 మండలాలను ఎంపిక చేసి, ఈ మండలాల్లో ఔషద మొక్కల నర్సరీలను ఏర్పాటు చేయనున్నారు. ఉసిరి, వేప, తులసి, ఇన్సులిన్, మల్టీవిటమిన్ తదితర సుమారు 150 రకాల ఔషద మొక్కలను ఈ నర్సరీల్లో పెంచి, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ అటవీశాఖాధికారి ఎస్.జానకిరావు, రాష్ట్ర జీవ వైవిద్య అవార్డు గ్రహీత, జమ్ము ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.