రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్దికి అత్యదిక ప్రాధాన్యత కల్పిస్తున్నదని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఎం.ఎస్.ఎం.ఇ మరియు టైక్స్ టైల్ పరిశ్రమలకు ప్రోత్సాహలను అందిస్తున్న ముఖ్యమంత్రి వీడియో కాన్పరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నేపద్యంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు నష్టపోతున్న తరుణంలో మూత పడకూడదు అన్న లక్ష్యంతో రీస్టార్ట్ ప్రోగ్రామ్ కింది ప్రోత్సాహకాలను అందించడం గొప్ప విషయమన్నారు. పరిశ్రమల యాజమాన్యమే కాకుండా అందులో పని చేస్తున్న కార్మికులు కూడా ఇబ్బంది పడకుండా ప్రాణవాయువులాగ ఆదుకున్నారని, రాష్ట్రం లో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికి ఇచ్చిన మాట ను నెరవేరుస్తున్న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చిత్త శుద్దితో, అంకిత భావంతో పని చేస్తున్నారని ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం ఇక్కడ ప్రజల అదృష్టమన్నారు. ఎస్.సి, ఎస్.టి., బి.సి మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ప్రోత్సహకాలు అందిస్తున్నారన్నారు.
జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ ఎం .ఎస్ .ఎం .ఇ పరిశ్రమల యూనిట్లకు సంబందించి మొత్తం రూ.21,70,00,000/- ప్రోత్సాహకాలను లబ్దిదారులకు అందించడం జరుగుతున్నదన్నారు.
విశాఖపట్నం, అగనంపూడికి చెందిన ఎం .ఎస్ .ఎం .ఇ లబ్దిదారులు జి.చిన్నబాబు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతూ తాను 1995 నుండి 2012 వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ లేబర్ గా పని చేసానని, 2013లో దళిత ఇంజనీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాదులో నిర్వహించిన ఇగ్నేట్ లో శిక్షణ తీసుకున్నానన్నారు. 2016లో సింగిల్ విండో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా 1129 చదరపు మీటర్ల స్థలాన్ని ఇచ్చారని దానిలో న్యూమాటిక్ టెక్నాలజిస్ పరిశ్రమను 35 లక్షలతో నిర్వహించుకుంటున్నానని అన్నారు. మూడు సంవత్సరాల నుండి విజయవంతంగా పని జరుగుతున్నదని ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు రూ 12,15,165 ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారని తన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. మా అబ్బాయి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడని నాడు – నేడు పథకంలో జగనన్న విద్యా కానుక వచ్చిందని మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుందని, చిన్నబాబు ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, శాసన సభ్యులు గొల్లబాబురావు, కరణం దర్మశ్రీ, కె.భాగ్యలక్ష్మి, డి .ఐ.సి జనరల్ మేనేజర్ రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు.