నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలి..


Ens Balu
3
Visakhapatnam
2021-09-03 16:58:51

నవరత్నాలు - పేదలందరికి ఇళ్లు గృహ నిర్మాణాలకు సంబందించిన పనులను   నిర్దేశించిన లక్ష్యాల మేరకు వేగవంతంగా పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం  కలెక్టర్ కార్యాలయం నుండి గృహ నిర్మాణ పనుల పై వారాంతపు సమావేశాన్ని  వీడియో కాన్పరెన్స్ ద్వారా మండల అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కాబట్టి  ఆరు నెలల్లో  అన్ని లే అవుట్ లలో గ్రౌండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.   పనుల అభివృద్ది పై రానున్న నాలుగు రోజులలో ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే  క్లీయర్ చేయాలన్నారు.  తేడాలు ఏమైనా జరిగితే సంబందిత అధికారులు, సిబ్బంది పై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎం.పి.డి.ఓ, డ్వామా, రెవెన్యూ, ఆర్ డబ్ల్యు ఎస్, ఇ.పి.డి.సి.ఎల్. శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిర్దిష్ట సమయంలో పనులను వేగవంతం చేయాలన్నారు.  గృహ నిర్మాణ పనులకు సంబందించి ప్రతి వారం 10 శాతం ప్రోగ్రస్ కనపడాలన్నారు. గ్రౌండింగ్ చేసిన ప్రతి లేఅవుట్ లకు జియో ట్యాగింగ్ తప్పని సరి అని, ఈ నెల 5వ తేదిలోగా పూర్తి చేయాలన్నారు. ఇసుక సమస్య ఉంటే సంబందిత ఆర్ డి ఓ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో  హౌసింగ్ జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, హౌసింగ్ పి.డి శ్రీనివాసరావు, డ్వామా పి.డి సందీప్, ఆర్ డబ్ల్యు ఎస్ ఇ రవికుమార్,  జి.వి.ఎం .సి, ఎ .పి.ఇ.పి.డి.సి.ఎల్, మెప్మా, హౌసింగ్ అధికారులు హాజరైయారు.
సిఫార్సు