తునిలో 1.50కోట్లతో అగ్రీ ఇన్ఫ్రా కాంప్లెక్స్..


Ens Balu
3
Kakinada
2021-09-04 06:40:40

తూర్పుగోదావరిజిల్లా తునిలో రూ.150 కోట్లతో అగ్రికల్చర్  ఇన్ఫ్రా ఫండ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టినట్టు మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు సూర్యప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. శనివారం ఈ మేరకు కాకినాడలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయాధారిత వ్యాపారాల నిమిత్తం ఈ కాంప్లెక్స్ ఉపయోగపడేలా ప్రభుత్వానికి నివేదించామన్నారు. తునిలో వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతున్నందు ఇక్కడే దీనిని నిర్మించాలని భావించామన్నారు. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి వుందని ఏడీ పేర్కొన్నారు. ఈ కాంప్లెక్స్ మంజూరైతే రైతులకు చాలా ఉపయోగకరంగా వుంటుందని ఆయన వివరించారు.
సిఫార్సు