అన్నిదానాల్లో కెల్ల అన్నదానం మిన్న..కొప్పల రామ్ కుమార్


Ens Balu
3
గోషా ఆసుపత్రి
2020-09-09 19:43:32

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో చేసే  ఏ సహాయమైనా అన్నార్తులకు ఆలంబనగా వుంటుందని బీజేపి సీనియర్ నాయకులు కొప్పల రామ్ కుమార్ అన్నారు. బు ధవారం విశాఖలోని గోషా ఆసుపత్రిలో రోగులు, సెక్యురిటీ సిబ్బందికి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొప్పల మాట్లాడుతూ, కరోనా వైరస్ సమయం లో తమవంతు బాధ్యతగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామని చెప్పారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రోగులకు ఆహార పొట్లాలు పంచిపెట్టినట్టు వివ రించారు. అంతేకాకుండా కరోనా వైరస్ నియంత్రణ జరిగే వరకూ తమ సామాజిక సేవకార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని వివరించారు. ఆసుపత్రి సూపరింటెం డెంట్ డా.విజయ కుమార్ మాట్లాడుతూ, ఇలాంటి సమయంలో చేసే సహాయం రోగులతోపాటు, వారి బంధువులకు ఎంతో స్వాంతన చేకూర్చుతుందన్నారు. కరోనా వలన చాలా మంది బయటకు రావడానికే భయపడుతున్నతరుణంలో మంచి మనసులో ఆసుపత్రి రోగులకు, సెక్యూరిటీ సిబ్బందికి  అన్నదాన కార్యక్రమం చేప ట్టడం అభినందనీయమన్నారు. నగదు సహాయం కంటే, అన్నదానం ఎంతో ఉపయుక్తంగా ఉండటంతో పాటు దాతు చేసిన సహాయాన్ని కూడా అంతా గుర్తుంచు కుంటారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక బీజేపి నాయకులు పాల్గొన్నారు.