స్టేడియం పనులు వేగవంతం చేయాలి..


Ens Balu
3
Srikakulam
2021-09-04 07:31:29

శ్రీకాకుళంస్టేడియం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ డిఎస్ డిఓను ఆదేశించారు. పాత్రునివలసలో 33 ఎకరాలలో నిర్మిస్తున్న మల్టీపర్పస్ స్టేడియం, శాంతినగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియం పనులను శనివారం ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రన్నింగ్ ట్రాక్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. స్టేడియం పనులు త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.  కావలసిన పరకరాలు ఏర్పాటు చేయాలన్నారు.  శాంతినగర్ కాలనీలో స్కేటింగ్, టెన్నీస్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ పనులను నిర్మాణానికి కేటాయించిన స్థలంను ఆయన పరిశీలించారు.  బాక్సింగ్ లో రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్ షిప్ సాధించిన వారిని ఆయన అభినందించారు.  జిల్లా స్థాయిలో సివిల్ సర్వీసెస్ క్రీడలను ఆయన ప్రారంభించారు.  అనంతరం ఆయన బ్యాట్మింటన్ ఆడారు.  ఈ పర్యటనలో జెసి-3 ఆర్ శ్రీరాములునాయుడు, ఆర్డిఓ ఐ. కిషోర్, డిఎస్ డిఓ శ్రీనివాసరావు, తహసిల్థార్ వెంకటరావు, పాత్రునివలస సచివాలయ సిబ్బంది, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.