పౌష్టికాహారాన్నిఅవగాహన పెంచుకోవాలి..


Ens Balu
2
Arilova
2021-09-04 09:11:12

ప్రభుత్వం గర్భిణీస్త్రీలు, చిన్నపిల్లలకు ఇచ్చే పౌష్టికాహారంపై అవగాహన పెంచుకొని దానిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. అన్నారు. శనివారం విశాఖలోని ఆరిలోవ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం వలన పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారని సూచించారు. గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులు ఐసిడిఎస్ కేంద్రం నుంచి అందించే విలువైన సూచనలు సలహాలను పాటించాలని కోరారు. ఆర్డేజీ చిన్మయిదేవి, అంగన్వాడీ శ్యామలాదేవి, కార్యకర్తలు, పిల్లల తల్లిదండ్రులు, గర్భిణీలు పాల్గొన్నారు.
సిఫార్సు