జెసి(అభివ్రుద్ధి) రాజకుమారికి బదిలీ..


Ens Balu
3
Kakinada
2021-09-04 11:13:33

తూర్పుగోదావరిజిల్లా జాయింట్ కలెక్టర్(అభివ్రుద్ధి)జె.రాజకుమారిని ప్రభుత్వం బదిలీచేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్ ఉత్తర్వులు జారీచేశారు. ఈమెను గుంటూరుజిల్లా జాయింట్ కలెక్టర్(గ్రామ, వార్డు సచివాలయశాఖ)కు బదిలీ చేశారు.రాజకుమారికి తూర్పుగోదావరి జిల్లాలో ఎనలేని అనుభంధం వుంది. డేరింగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిగా జిల్లాలో పేరుతెచ్చుకున్నారు. ఎన్నో అభివ్రుద్ధి కార్యక్రమాలు ఈమె దగ్గరుండి చేయించారు. కరోనా సమయంలో జెసి చేసిన సేవలను జిల్లావాసులు నేటికీ గుర్తుంచుకుంటారు. జిల్లాలో తనదైన ముద్రవేసుకున్నారు.