సింహగిరి క్షేత్రం ఆధ్యాత్మిక సౌరభం..
Ens Balu
2
Simhachalam
2021-09-04 11:25:34
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌరభాల గుబాళింపు అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి అభిప్రాయపడ్డారు. శనివారం స్వామివారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్రతాలు, పూజలకు ఏర్పాటుచేసిన కొత్త మండపం, కళ్యాణ మండపం ఏర్పాట్లు ఎంతో బాగున్నాయని ప్రశంసల జల్లు కురిపించారు. కొత్త మండపాన్ని లక్ష్మీనారాయణ వ్రతం , ఇతర సేవలకోసం ఉపయోగించడం అద్భుతంగా ఉందన్నారు. " ఆధ్యాత్మికతతో నిండిన ఈ పవిత్ర ఆలయ దర్శనంతో నా జన్మ ధన్యమైన భావన కలుగుతోంది" అంటూ జస్టిస్ శేషసాయి విజిటర్స్ బుక్ లో రాశారు. దేవస్థానం సమీపంలోకి వచ్చినవెంటనే ఆధ్యాత్మిక , సాంస్కృతిక సౌరభాలు గుభాళిస్తున్నాయన్నారు. ఇంతకు ముందుకూడా దేవస్థానానికి వచ్చి స్వామిని దర్శించుకున్నానని జస్టిస్ పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆలయంలో జరుగుతున్న, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు ఈఓ ఎంవీ సూర్యకళ దగ్గరుండి వివరించారు. కార్యక్రమంలో ఆలయసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.