హైకోర్టు న్యాయమూర్తికి ఘనస్వాగం..
Ens Balu
4
Vizianagaram
2021-09-05 09:23:09
ఒక్క రోజు పర్యటనలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్‌కి ఘన స్వాగతం లభించింది. స్థానిక జడ్పీ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తల గోపి, జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, ఎస్పీ దీపికా ఎం పాటిల్‌లు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. పోలీసులు గౌరవం వందనం సమర్పించారు. అనంతరం ఆయన అతిథి గృహంలోకి చేరుకొని కాసేపు న్యాయ అధికారులు, జిల్లా అధికారులతో మాట్లాడారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం జ్యుడీషియల్ అధికారుల సమావేశంలో పాల్గొనేందుకు జిల్లా కోర్టుకు వెళ్లిపోయారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి శిరీషా, జాయింట్ కలెక్టర్లు జి.సి. కిశోర్ కుమార్, జె. వెంకటరావు, డీఆర్వో ఎం. గణపతిరావు, ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్, విజయనగరం తహశీల్దార్ ప్రభాకర్, న్యాయ అధికారులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.