జాతీయ పద్మశాలీ సంఘంలో కొప్పలకు చోటు..
Ens Balu
3
Visakhapatnam
2021-09-05 11:16:10
విశాఖకు చెందిన కొప్పల రామ్ కుమార్ నుఅఖిల భారత పద్మశాలి సంఘంలో యువజన విభాగానికి జాతీయ వైస్-చైర్మన్ గా నియమిస్తూ జాతీయ అధ్యక్షులు సుంకర్వర్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొప్పల రామ్ కుమార్ ప్రస్తుతం బీజేపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ గా బాద్యతలు నిర్వహిస్తున్నారు. రాజీకియాలలో క్రియ శీలంగా వుంటూనే చేనేత సామాజిక వర్గం సమస్యల పట్ల, పద్మశాలియుల అభ్యుదయానికి నిరంతరం కృషి చేస్తున్నారు. "పద్మశాలి ఆత్మీయ సేవ సంగం" పేరిట దిగువ తరగతి పద్మశాలియుల కుటుంబాలకు సహాయ సహకారాలు అందించటం, వారికి నిరంతరం అందుబాటులో వుండటం, వారితో మమేకం కావడం వల్ల వారికి కుల బాంధవుడుగా గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించిన అఖిల భారత పద్మశాలి సంఘం లో కీలక పదవిని కట్టబెట్టం పట్ల చేనేత వర్గీయులంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ, తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ పదవి కట్టబెట్టిన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. ఇకపై మరింత శ్రమించి చేనేత సామాజిక వర్గ అభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని చెప్పారు.