తూ.గో.జి.కి లక్షా 10వేల కోవిడ్ డోసులు..


Ens Balu
3
Kakinada
2021-09-05 15:29:21

తూర్పుగోదావరి జిల్లా లక్షా 10వేకోవిడ్ టీకాలు ప్రభుత్వం కేటాయించందని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.గౌరీశ్వర్రావు తెలియజేశారు. ఆదివారం కాకినాడ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మొత్తం 90వేల కోవీషీల్డ్ టీకాలు, 20వేలు కోవాగ్జిక్ టీకాలు మంజూరు చేసిందన్నారు. వీటిని జిల్లాలోని 64 మండలాలకు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. జిల్లాలోని శాస్వత కోవిడ్ వేక్సినేషన్ కేంద్రాలతోపాటు, జిల్లావ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కూడా సోమవారం కోవిడ్ వేక్సినేషన్ జరుగుతుందన్నారు. 18ఏళ్లు నిండిన వారికి, మొదటిడోసు పూర్తయి84 రోజులు దాటిన వారికి 2వ వడోసు కూడా వేస్తారని డిఎంహెచ్ఓ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని కోవిడ్ నియంత్రణలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతీఒక్కరూ కోవిడ్ వేక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించాలని ఆ ప్రకటనలో కోరారు.