తూర్పుగోదావరి జిల్లా 303 గ్రామ పశుసంవర్ధ సహాయకుల(వీఏహెచ్ఏ) పోస్టులు భర్తీకాలేదని పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎస్.సూర్యప్రకాశరావు తెలియజేశారు. ఈమేరకు సోమవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం జిల్లాకి 987 పశుసంవర్ధ సహాయకుల పోస్టులు మంజూరు చేయగా అందులో కేవలం 684 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయన్నారు. అర్హులైన వారు లేకపోవడం వలన మిగిలిన పోస్టులు భర్తీకాలేదన్నారు. వచ్చే నోటిఫికేషన్ లో ఈ పోస్టులు భర్తీచేసే అవకాశం వుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వీరంతా వారికి కేటాయించిన ప్రదేశాల్లో పాడి రైతులకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.