మైనారిటీ విధ్యార్ధులకు ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్, మెరిట్ కం మీన్స్ జాతీయ ఉపకార వేతనముల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలక్టరు ఎ.సూర్యకుమారి ప్రకటనలో తెలిపారు. భారత మైనారిటీ మంత్రిత్వ శాఖ, దేశం లోని మైనారిటీ కులములకు ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్ఖులు, బౌద్దులు, పార్సీలు, జైన్లు చెందిన విద్యార్ధులకు 2021 - 22 విద్యా సంవత్సరములో ‘జాతీయ ఉపకార వేతన పధకం’ద్వారా ఉపకార వేతనాలు అందించుటకు ధరఖాస్తులను తే.23.08.2021ది నుండి ప్రీ మెట్రిక్, తే.15.11.2021ది లోగా, పోస్ట్ మెట్రిక్ మెరిట్ కం మీన్ 30.11.2021ది లోగా ఆన్ లైన్ ద్వారా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కావున విజయనగరం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు వృత్తి విద్యా, సాంకేతిక విద్యా సంస్థలు https://nsp.gov.in లో ఆన్ లైన్ ద్వారా ముందుగా e-KYC రిజిస్ట్రేషన్ నమోదు చేసుకొని, తదుపరి ఆయా విద్యా సంస్థల లో చదువుకొంటున్న మైనారిటీలకు చెందిన విద్యార్ధులు సదరు పోర్టల్ National Scholarship Portal www.scholarshipsgov.in.in ద్వారా ఆన్ లైన్ లో పెట్టిన ధరఖాస్తులను పరిశీలించి ఆమోదించడం జరుగుతుందన్నారు.
మైనారిటీ విద్యార్దులకు మూడు విదములుగా ఉపకార వేతనములు మంజూరుకు భారత ప్రభుత్వం(మైనారిటీ మంత్రిత్వ శాఖ) నిర్ణయించినారని, ప్రీమెట్రిక్ ఉపకార వేతనములు, పోస్టు మెట్రిక్ ఉపకార వేతనములు, మెరిట్ కం మీన్ ద్వారా మైనారిటీల విద్యార్ధులు (ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్ఖులు, బౌద్దులు, పార్సీలు, జైన్లు) ఉపకార వేతనం పొందుటకు అర్హులని అన్నారు.