మత్స్యకారుల అభివ్రుద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది..


Ens Balu
4
Kurupam
2021-09-06 13:35:00

మత్స్యకారుల అభివ్రుద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేత్రుత్వంలో ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తున్నదని డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. సోమవారం కురుపాం నియోజకవర్గంలోని గుజ్జువాయి రిజర్వాయర్ లో “ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన” పధకంలో భాగంగా 90వేల చేప పిల్లలను మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎన్.నిర్మల కుమారితో కలిసి విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేనివిధంగా మత్స్యకారుల అభివ్రుద్ధికోసం జగనన్న ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎన్.నిర్మల కుమారి మాట్లాడుతూ, సుస్థిరమైన, భాద్యతాయుతమైన మత్స్య అబివృద్ధి కోసం 2020-21నుంచి  2024-25వరకు 5ఏళ్లలో అమలు పరిచేవిధంగా  ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.  రూ. 96,300/- విలువ కలిగిన 90వేల చేప పిల్లలను 60శాతం సబ్సిడీతో    రూ. 57, 780/- కేవలం రూ. 38,520/-లతో సరఫరా చేసామని డిడి మంత్రికి వివరించారు. ఆక్వా రైతులుకు అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సాగర మత్స్యకారులకు వేట నిషేద భ్రుతిని రూ. 4,000/-లు నుండి రూ. 10,000/-లు పెంచడంతో పాటు..  50 సంవత్సారాలు దాటిన మత్స్యకారులందరికి మత్స్యకార ఫించను   అందజేయడం, ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులు ఎక్ష్ గ్రేషియాను రూ. 5.00 లక్షలు నుంచి రూ. 10.00లక్షలుకు పెంచడం, ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ అందజేస్తున్న విషయాన్ని తెలియజేశారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి, నాణ్యమైన సీడ్, ఫీడ్ మరియు ఆక్వా కల్చర్ అనుమతులు సరళంగా, త్వరితగతిన పొందడం కోసం ఏర్పాటు చేసిన 3చట్టాలును (ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్ 2020,  ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్)(సవరణ) యాక్ట్ 2020, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ది సంస్థ చట్టం 2020) లను ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. జిల్లాలో స్థానిక మత్స్య ఉత్పత్తులపై వాడకం పెరగటం కోసం మత్స్యశాఖ చేస్తున్న కృషి వలన ఆక్వా రైతులకు మధ్యవర్తుల బెడద లేకుండా మంచి గిట్టుబాటు ధర దొరకడం అభినందనీయమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కమిటి ఎ.ఇందిర కుమారి, వ్యవసాయ మార్కెట్ కమిటి, కురుపాం  చైర్మన్ నిమ్మల వెంకట రావు, మత్స్య శాఖ సహాయ  సంచాలకులు  పి. కిరణ్ కుమార్, జిల్లా మత్స్యకార సహకార సంఘం వైస్ ప్రెసిడెంట్ దాసరి లక్ష్మణ రావు, గుజ్జువాయి గ్రామ సర్పంచ్ హెచ్. నాగేశ్వరరావు, గిరిజన మత్స్యకార సహకార సంఘం ప్రెసిడెంట్ చిన్నా రావు,  వైఎస్సార్సీపీ కురుపాం మండల కన్వీనర్ గౌరీ శంకర రావు  తదితరులు పాల్గొన్నారు.