సంక్షేమ పథకాలు పూర్తిగా అమలుచేయాలి..


Ens Balu
3
Visakhapatnam
2021-09-06 13:49:29

రాష్ట్ర ప్రభుత్వం  పేద ప్రజలు సంక్షేమం  కోసం పలు అభివృద్ది ఫథకాలను అమలు చేస్తున్నదని వాటిని సక్రమంగా అమలు చేయాల్సిన భాద్యత అధికారులదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు జిల్లా ఇన్ చార్జిమంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు.  శనివారం వి ఎం .ఆర్ డి ఎ చిల్డ్రన్ ఎరినాలో  జిల్లా లో అమలు జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.  జి.వి.ఎం .సి,  వి.ఎం .ఆర్ డి ఎ లలో జరుగుతున్న అభివృద్ది పనులు, ఇరిగేషన్, ఆరోగ్యం, నాడు – నేడు పనులు ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలైన, సచివాలయాలు, ఆర్.బి.కె.లు, డిజిటల్ లైబ్రేరీలు, అంగన్వాడీ భవన నిర్మాణాల పనులు, వై ఎస్ ఆర్ అర్బన్, విలేజ్ హెల్త్ క్లినిక్ లు, మెడికల్ కాలేజీలు, పి.హెచ్ సిలు, సి.హెచ్.సిలు, వ్యవసాయ మరియు అనుబంధశాఖలలో నూతన ప్రాజెక్టుల వివరాలు, గృహనిర్మాణాల పనులు, పరిశ్రమలలో నూతన మెగా ప్రాజెక్టులు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో  రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి, జిల్లా కలెక్టర్ .డా.ఎ.మల్లిఖార్జున,పార్లమెంటుసభ్యులుబి.సత్యవతి,ఎం.వి.వి.సత్యన్నారాయణ, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, నగర మేయర్ జి.హరివెంకటకుమారి, వి.ఎం.ఆర్.డి.ఎ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, వి.ఎం .ఆర్ .డి.ఎ. కమిషనర్ రమాణారెడ్డి, జి.వి.ఎం .సి కమిషనర్ జి.సృజన, జాయింట్ కలెక్టర్లు  ఎం .వేణుగోపాల రెడ్డి, పి.అరుణ్ బాబు,   శాసన సభ్యులు గొల్లబాబురావు, కన్నబాబురాజు, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ , గుడివాడ అమర్ నాద్, అధీప్ రాజు, కె.భాగ్యలక్ష్మి, వాసుపల్లి గణేష్ కుమార్, పలు కార్పోరేషన్ల చైర్మన్ లు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరైయారు. 
ఈ సందర్భంగా ఇన్ చార్జి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా వరకు కోవిడ్ ఉదృతి తగ్గిందని ఇక అభివృద్ది సంక్షేమ పథకాలపై అధికారులు దృష్టి పెట్టి పనులను వేగవంతం చేయాలన్నారు.  మన ముఖ్యమంత్రి విశాఖపట్నానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ పలు కార్పోరేషనులకు చైర్మన్ లను ఏర్పాటు చేసారన్నారు.   సంబందిత చైర్మన్ లు వారికి అప్పగించిన కార్పోరేషన్ల అభివృద్దికి పాటు పడాలన్నారు. కొండవాలు ప్రాంతాలు, డ్రైనేజి కాలువలకు రిటైనింగ్ వాల్సు పనులకు సంబందించి  జోనల్ కమిషనర్లు, కార్పోరేటర్లతో  చర్చించి పనులను చేపట్టాలన్నారు. వార్డు సెక్రటేరియట్ సిబ్బంది సక్రమంగా పని చేయటం లేదని పిర్యాదులు అందుతున్నాయన్నారు. 
అన్ని సచివాలయాల సిబ్బంది సంక్షేమ పథకాల డేటా పై అవగాహన కలిగి ఉండాలని , రిజిష్టరు ను మెయింటైన్  చేయాలన్నారు. ఇంజనీరింగు అధికారులు సచివాలయాలను తనిఖీ చేసి  సిబ్బంది చేస్తున్న ఫిర్యాదులను పరిశీలించాలన్నారు.  100 గజాల లోపు స్థలాలలో  ఇళ్లు నిర్మించుకుంటున్న పేదవాళ్ల ఇళ్లను పడగొట్టి ఇబ్బంది  పెట్టవద్దని వారికి తగు న్యాయం చేయాల్సిందిగా  కమిషనర్ కు సూచించారు.   మురికి వాడలలో నివసిస్తున్న వారికి పట్టాలు ఇచ్చి  ఇళ్ల నిర్మాణాలను  చేపట్టి మురికివాడల రహిత ప్రాంతాలగా తీర్చి దిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నాదన్నారు. 
రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో జరిగే అభివృద్ది కార్యక్రమాల శంఖుస్థాపనలు, ప్రారంబోత్సవాలకు  తప్పని సరిగా ప్రొటోకాల్ నిబందనలను పాటించాలని,  కార్పోరేటర్లు,  నియోజక వర్గ ప్రజా ప్రతినిధులను  నిర్లక్ష్యం చేయకుండా  అహ్వనించాలన్నారు.   ప్రొటోకాల్ ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు తీసుకోవల్సిందిగా కలెక్టర్ కు  స్పష్టం చేశారు.   జి.వి.ఎం .సి పరిధిలో  ఉండే షాపుల అద్దెలకు సంబందించి  ఇటీవల కాలంలో చాలా ఫిర్యాదులు అందుతున్నాయని ప్రభుత్వ ఉత్తర్వువులు  వచ్చిన తదిపరి తగు చర్యలు తీసుకోవల్సిందిగా జి.వి.ఎం .సి కమిషనర్ కు  సూచించారు.  అదే విదంగా   షాపుల లీజులను సంబందించి  కార్పోరేటర్లతో సబ్ కమిటి వేసి నివేదిక వచ్చిన తరువాత కౌన్సిల్ లో 15 రోజుల్లో చర్చించి ముందుకు వెళ్లాల్సిందిగా తెలిపారు. 
రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి  ఇళ్ల లేని ప్రతి నిరుపేదకు గృహ నిర్మాణాలను అందజేస్తూ వారికి మౌళిక వసతులను కల్పిస్తున్నారన్నారు. మధురవాడ ప్రాంతంలో వీధిలైట్లు, త్రాగునీరు, శానిటేషన్ సమస్య అధికంగా ఉందని సమస్యలను పరిష్కరించాల్సిందిగా జి.వి.ఎం .సి కమిషనర్ కు ఆదేశించారు.   
జి.వి.ఎం.సి లో జరుగుతున్న ప్రాజెక్టుల అభివృద్ది పనులకు సంబందించి కమిషనర్ జి.సృజన పవర్ పాయింట్ ప్రజన్టేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. అనంతరం వి.ఎం .ఆర్ .డి.ఎ., కమిషనర్  ఎన్ .ఎ. డి ప్లైఓవర్, సిరిపురం లో మల్టీ లెవెల్ కారు పార్కింగ్,  మరియు కమర్షియల్ కాంప్లెక్స్, బీచ్ రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్, కైలాసగిరిలో 380 ఎకరాలలో అభివృద్ది పనులు, ఎన్ హెచ్ 16, అచ్చుతాపురం, చుక్కవానిపాలెం నుండి నాతయ్యపాలెం వరకు  మాష్టర్ ప్లాన్ రోడ్డు కనెక్షన్  తదితర పనులను గూర్చి మంత్రులకు వివరించారు. 
కోవిడ్ ను ఎదుర్కోవడంలో రాష్ట్రం తీసుకున్న చర్యలకు ప్రత్యేక ప్రశంసలు లభించాయని మంత్రి కన్నబాబు తెలిపారు.  కోవిడ్ మూడవ వేవ్ వచ్చినట్లయితే ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్దంగా వుందని మంత్రి వెల్లడించారు.   సంసిద్దత, చేపట్టిన చర్యలను గూర్చి జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు వివరించారు.  
జిల్లాలో జివియంసి, అర్బన్ హెల్త్ సెంటర్లు, కెజిహెచ్ లలో కరోనా సమయంలో విధులను నిర్వహించిన తాత్కాలిక ఎఎన్ఎం, టెక్నీషియన్స్ తదతర వైద్య ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిందిగా  విజయసాయి రెడ్డిని,  మంత్రులను అభ్యర్ధించగా  వారికి ఉద్యోగ భద్రత కొరకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.