అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి..
Ens Balu
1
Srikakulam
2021-09-06 14:15:07
జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద ప్రకటించబడిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల పేర్లులో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 9లోగా తెలియజేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీచేసారు. జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద డెంటల్ హైజినిస్ట్, ఆడియోలజిస్ట్, సైకాలజిస్ట్, కార్డియాలజిస్ట్, సైక్రాటిస్ట్, జనరల్ మెడిసిన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, మరియు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ - ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనియున్న అభ్యర్ధుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్టులను శ్రీకాకుళం జిల్లా అధికారిక వెబ్ సైట్ www.srikakulam.ap.gov.in వెబ్ పోర్టల్ నందు అభ్యర్ధుల సౌకర్యార్ధం ఉంచినట్లు చెప్పారు. కావున సదరు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనియున్న అభ్యర్ధులు వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ నందు వారి పేర్లు మరియు మెరిట్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని చెప్పారు. వీటిపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నచో సెప్టెంబర్ 9లోగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంనకు వచ్చి వారి అభ్యంతరాలను తెలియజేసి సరిచేసుకోవలసినదిగా ఆయన ఆ ప్రకటనలో కోరారు.