పేస్ షీల్డ్ వాడండి..కరోనాను ఆపండి..కలెక్టర్ నివాస్


Ens Balu
5
Srikakulam
2020-09-09 20:01:19

శ్రీకాకుళం జిల్లాలో ప్రతీ ఒక్కరూ పేస్ షీల్డ్  వాడి కరోనాను నియంత్రించడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు.  పివీఎస్ రామ్ మోహన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫేషి షీల్డ్ ల పంపిణీ కార్యక్రమం ఆదివారం పేటలో బుధవారం జరిగింది. జిల్లా కలెక్టర్ జె నివాస్ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాస్కులతో పాటు ఫేషి షీల్డ్ ల వినియోగం తో 80 శాతం మేర కరోనా భారీన పడే అవకాశం లేదని అన్నారు. స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో స్లమ్ ప్రాంతాల్లో 25 వేల ఫేషి షీల్డ్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. కరోనా నివారణకు జిల్లాలో అనేక చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా తాజాగా ఫేషి షీల్డ్ ల పంపిణీ చేపట్టామన్నారు.  పివీఎస్ రామ్ మోహన్ ఫౌండేషన్ అధ్యక్షుడు డా. పివీఎస్ రామ్ మోహన్ మాట్లాడుతూ జిల్లాలో 8 వేల ఫేస్ షీల్డ్ లు పంపిణీ కి చర్యలు చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకారాన్ని అందించి కరోనాకు పారద్రోలాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ పి.నల్లనయ్య, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కూర్మారావు, రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహన రావు, తహసీల్దార్ వై.యస్.ప్రసాద్,  వైద్యులు డా.రవి, రెడ్ క్రాస్ సభ్యులు పి.శ్రీకాంత్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.