విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్ టాప్ లు పంపిణీ..


Ens Balu
3
Srikakulam
2020-09-09 20:08:37

శ్రీకాకుళం జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్ టాప్ లను రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా కలెక్టర్ జె నివాస్ పంపిణీ చేశారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సరఫరా చేసిన ల్యాప్ టాప్ లను ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. లాప్ టాప్ లు పొందిన వారి వివరాలు ఈవిధంగా ఉన్నాయి. శారద డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం బిఎస్సి చదువుతున్న తాటిపూడి పూజ, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడవ సంవత్సరం బిఎ విద్యనభ్యసిస్తున్న కర్రీ పవన్ కళ్యాణ్, అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఎంఎల్ఐఎస్సి చదువుతున్న సింగుపురం దుర్గాప్రసాద్,   పైడి తేజ, ఎం.ఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కాగితపు వినోద్ నాయుడు,  ఎం.కాం చదువుతున్న పట్టా శంకర్రావు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ ఇంగ్లీష్ చదువుతున్న కొడంగి మజ్జయ్య, ఎం.ఏ తెలుగు అభ్యసిస్తున్న రెడ్డి దేవేంద్రుడు, పి.హెచ్.డి చేస్తున్న గిరడ సుజాత, ఎమ్.ఏ చదువుతున్న బిల్లుకొల హిమగిరి., పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో పీహెచ్డీ చేస్తున్న మునకాల ధనలక్ష్మి., సీతంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఏ  చదువుతున్న డిల్లేశ్వరరావు, బిడ్డిక గంగారావు., శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఏ చదువుతున్న తమ్మినేని రాజ్యలక్ష్మి, ఎల్లా జయరాజు, రెల్లా శారద, ఎం.కామ్ చదువుతున్న కొంచాడ నారాయణ రావు., రాజాం స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో బిఎ చదువుతున్న కొవ్వాడ స్వప్న, శివాని డిగ్రీ కాలేజీ లో బీ కాం చదువుతున్న నజన రామారావు,  విశాఖపట్నం క్రిష్ణ కాలేజ్ లో బీఎస్సి చదువుతున్న గాలి నూక రెడ్డి, పాలకొండ డా.డి.ఎల్.నాయుడు డిగ్రీ కళాశాలలో బి.కాం చదువుతున్న ఆకెన్న ఢిల్లీశ్వరి,  విశాఖపట్నం బాబా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎం.బి.ఏ చదువుతున్న పిల్లా దుర్గాప్రసాద్ ఉన్నారు. ప్రభుత్వం అన్ని విధాల సహకరించుటకు సిద్ధంగా ఉందని  ఉప ముఖ్యమంత్రి అన్నారు. మంచి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన సూచించారు. విభిన్న ప్రతిభావంతులు ఎంతో ప్రతిభ కలవారిని ఆయన అన్నారు. తమ ప్రతిభను వివిధ రంగాల్లో చూపించి జిల్లాకు గర్వకారణం గా నిలబడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు జీవన్ బాబు కార్యక్రమం గూర్చి వివరిస్తూ ప్రభుత్వం దాదాపు రూ.7.50 లక్షల ఖర్చుతో లాప్ టాప్ లు సమకూర్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి తదితరులు పాల్గొన్నారు.