ప్రభుత్వ ప్రోత్సాహంతో జీవన ప్రమాణాలు పెంచుకోవాలి..
Ens Balu
3
Parvathipuram
2021-09-07 11:29:03
ప్రభుత్వం రాయతీపై సరఫరా చేస్తున్న చేపపిల్లలను పెంపకం చేసి మత్స్యకారులు తమ యొక్క జీవన ప్రమాణాలును మరింతగా పెంపొందించుకోవాలని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపు నిచ్చారు. బుధవారం పార్వతీపురం మండలం, పెద బొండపల్లి గ్రామం, తామర చెరువులో సబ్సిడీపై సరఫరా చేసిన ఫింగర్ లింగ్ సైజు గల 50వేల చేపపిల్లలను మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎన్.నిర్మల కుమారితో కలిసి విడుదల చేసారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మత్స్యకారుల సంక్షేమం, అభివ్రుద్ధికోసం వైఎస్. జగనన్న ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎన్.నిర్మల కుమారి మాట్లాడుతూ, సుస్థిరమైన, భాద్యతాయుతమైన మత్స్య అబివృద్ధి కోసం 2020-21నుంచి 2024-25వరకు 5ఏళ్లలో అమలు పరిచేవిధంగా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఆక్వా రైతులుకు అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సాగర మత్స్యకారులకు వేట నిషేద భ్రుతిని రూ. 4,000/-లు నుండి రూ. 10,000/-లు పెంచడంతో పాటు.. 50 సంవత్సారాలు దాటిన మత్స్యకారులందరికి మత్స్యకార ఫించను అందజేయడం, ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులు ఎక్ష్ గ్రేషియాను రూ. 5.00 లక్షలు నుంచి రూ. 10.00లక్షలుకు పెంచడం, ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ అందజేస్తున్న విషయాన్ని తెలియజేశారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి, నాణ్యమైన సీడ్, ఫీడ్ మరియు ఆక్వా కల్చర్ అనుమతులు సరళంగా, త్వరితగతిన పొందడం కోసం ఏర్పాటు చేసిన 3చట్టాలును (ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్ 2020, ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్)(సవరణ) యాక్ట్ 2020, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ది సంస్థ చట్టం 2020) లను ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. జిల్లాలో స్థానిక మత్స్య ఉత్పత్తులపై వాడకం పెరగటం కోసం మత్స్యశాఖ చేస్తున్న కృషి వలన ఆక్వా రైతులకు మధ్యవర్తుల బెడద లేకుండా మంచి గిట్టుబాటు ధర దొరకడం అభినందనీయమని ఎమ్మెల్యే అలజంగి జోగారావు పేర్కొన్నారు. మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ సహాయ సంచాలకులు పి. కిరణ్ కుమార్, మత్స్య శాఖ అభివృద్ధి అధికారి టి. నాగమణి, జిల్లా స్వదేశీ మత్స్యకార సహకార సంఘ ఉపాధ్యక్షులు దాసరి లక్ష్మణ రావు, నర్సిపురం స్వదేశీ మత్స్యకార సహకార సంఘ అధ్యక్షులు తిరుపతి, మత్స్యకార సహకార సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.