రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ..
Ens Balu
2
Tirumala
2021-09-07 12:53:22
తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం(చిత్తూరు జిల్లా వారికి మాత్రమే) టోకెన్లు జారీ చేయాలని భక్తుల నుంచి వస్తున్న కోరిక మేరకు సెప్టెంబరు 8 వ తేదీ బుధ వారం ఉదయం 6 గంటల నుండి రోజుకు 2 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. అలిపిరి లోని భూదేవి కాంప్లెక్స్ లోని కౌంటర్లలో చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ప్రయోగాత్మకంగా టోకెన్లు జారీ చేస్తారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టోకెన్లు పొందేందుకు సహకరించాలని టీటీడీ విజ్ఞపి చేస్తోంది.