అప్పన్నకు వైశ్యకార్పోరేషన్ చైర్మన్ పూజలు..
Ens Balu
3
Simhachalam
2021-09-08 05:55:13
సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రిఅప్పన్న) స్వామి వారిని బుధవారం రాష్ట్ర వైశ్య వెల్ఫేర్, డవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కుప్పం ప్రసాద్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆయనతోపాటు ట్రస్టుబోర్డు సభ్యురాలు గరుడ మాధవి, ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, 32వ వార్డు (విశాఖ) కార్పొరేటర్ డా. కందుల నాగరాజు స్వామివారిని దర్శించుకున్నారు. వైశ్వ కార్పొరేషన్ ఛైర్మన్ కు స్థలపురాణాన్ని, ఈఓగా సూర్యకళ బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ట్రస్టుబోర్డు సభ్యురాలు గరుడ మాధవ వివరించారు. నరసింహ అవతారాలను శుభ్రపరిచిన తీరు, ఆలయం బయట సుందరీకరణను వివరించారు. నరసింహ అవతారాలు తెలిసేలా బోర్డులు పెట్టడం అందర్నీ ఆకట్టుకుంది. దేవస్థానంలో ఈఓ సూర్యకళ చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికలను గరుడ మాధవి వివరించారు. సింహాద్రి అప్పన్న ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని కుప్పం ప్రసాద్, డా.కందుల నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.