అనంతపురం అంబేద్కర్ నగర్ ను అన్ని విధాలా అభిరుద్దీ చేస్తామని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని 21 వ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య పనులను బుధవారం నగర మేయర్ నగరంలోని అంబేద్కర్ నగర్ లో డిప్యూటీ చైర్మన్ కొగటం విజయ్ భాస్కర్ రెడ్డి, నగర కమిషనర్ పివివిఎస్ మూర్తి, స్థానిక కార్పొరేటర్ సాకే చంద్రలేఖ తో కలసి పర్యటించారు. డివిజన్ లో పలుచోట్ల డ్రైనేజీలు లేఖ మురుగునీరు రోడ్డుపైకి వస్తున్న విషయాన్ని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు.పేదలు అధికంగా నివసిస్తున్న అంబేద్కర్ నగర్ లో డ్రైనేజీలు, రోడ్లు సరిగా లేక దోమలు ప్రబలుతున్నాయని తద్వారా తరచూ స్థానికులు రోగాల బారిన పడుతున్నారని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన అంబేద్కర్ నగర్ అభిరుద్దీ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అనీల్ కుమార్ రెడ్డి, స్థానిక వైకాపా నాయకులు కుల్లాయి స్వామి,ఏ ఈ నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.