విద్య మానవ జీవితాలనే మార్చేస్తుంది..


Ens Balu
3
Chittoor
2021-09-08 07:34:08

జీవితంలో మార్పును తీసుకొని రాగలిగే శక్తి విద్యకు మాత్రమే ఉందని.. పేద ప్రజలు చీకటిలో చదవకుండా వారు మంచి వాతా వరణంలో చదివేలా రాష్ట్ర ప్రభుత్వం మన బడి నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ అన్నారు. బుధవారం ఉదయం డి.ఆర్.డి ఏ సమావేశ మందిరంలో నాడు – నేడు రెండవ విడత చేపట్టనున్న కార్యక్రమాలకు సంబందించి శిక్షణా కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంబించారు.  ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో 1533 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, 95 శాతం పాఠశాలల స్థితి గతులు మార్చి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడం జరిగిందని, మిగతా పాఠశాలల్లో చిన్న చిన్న మార్పులు కూడా చేస్తున్నారని పాఠశాలలకు వెళ్లినప్పుడు విధ్యార్ధుల తల్లి దండ్రులు, విధ్యార్ధులు, ఉపాద్యాయులు కూడా పాఠశాలల్లో చేపట్టిన పనులకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం ఇరిగేషన్, రోడ్లు భవనాలు, గ్రామీణ నీటి పారుదల సర్వ శిక్ష అభియాన్ కు చెందిన ఇంజినీరింగ్ అధికారులు రెండవ విడతలో 1671 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. మనం చేస్తున్న ఈ కార్యక్రమం నిండు మనసుతో విధ్యార్ధుల భాయిషత్తు కోసం చేయాలని, రాష్ట్ర భవిష్యతే దేశ భవిష్యత్ అని ఈ రెండింటిని ముందుకు తీసుకో పొగలిగినది విధ్యార్ధుల భవిష్యత్ కోసం మనం కృషి చేస్తున్న విషయం మరువ కూడదన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని అనుకోవడం సహజమని రాష్ట్ర ప్రభుత్వం అందరి భావిషత్ కోసం మార్పులు తీసుకొని రావాలని భావించిందన్నారు. 
జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) వి.వీర బ్రహ్మo మాట్లాడుతూ చదువు ఎటు వారినైనా ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందని అటువంటి ఉజ్వల భవిష్యత్ కల్పించే పాఠశాలల రూపు రేఖలు మార్చే అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావించి పనులు చేయించాలని ప్రధానంగా పాఠశాలలు 12 అంశాలను ప్రాధాన్యతగా భావించాలని ఇందులో మరుగు దొడ్లు ఏర్పాటు అందుకు నీటి సరఫరా, ఆర్.ఓ సిస్టమ్ ద్వారా మంచి నీటి సరఫరా, చిన్న లేదా పెద్ద రిపేర్లు, విధ్యుత్ సౌకర్యం తో పాటు ఫ్యాన్ లు, ట్యూబ్ లైట్లు ఏర్పాట్లు, విధ్యార్ధులకు, ఉపాద్యాయులకు ఫర్నిచర్, గోడలకు అందమైన పెయింటింగ్, గ్రీన్ చాక్ బోర్డు, ఇంగ్లీషు ల్యాబ్, వంట గది, కాంపౌండ్ వాల్స్, అదనపు గదుల నిర్మాణం, పాఠశాలలకు అనుబందంగా ఉన్న అంగన్ వాడి కేంద్రాల రిపేర్లు, నాణ్యతగా చేయాలని అన్నారు. ఎస్.ఎస్.ఎ.ఎ.పి.సి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ గతంలో మొదట 1517 పాఠశాలలను ఇవ్వడం జరిగిందని కొన్ని మార్పుల అనంతరం 1533 పాఠశాలలను ఇచ్చారని దాదాపుగా అన్ని పాఠశాలల రూపు రేఖలు మార్చామని రానున్న కాలం లో రెండవ విడత 1671 పాఠశాలల రూపు రేఖలను మార్చేందుకు అనుమతి ఇచ్చారన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం తరువాత మండల స్థాయిలో జరిగే శిక్షణ అందరూ సంబందిత మండల అధికారులు పాల్గొనాలని ఎ.పి.సి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) వి.వీరబ్రహ్మo, ఎస్.ఎస్.ఎ.ఎ.పి.సి వెంకట రమణ రెడ్డి, ఆర్.డబ్ల్యూ.ఎస్.ఈ విజయ్ కుమార్, డి.ఈ.ఓ పురుషోత్తంలతో పాటు వివిధ శాఖల ఇంజినీర్లు పాల్గొన్నారు.